మొహం మీద కొట్టినట్టు చెప్పారే.. నయన్ విఘ్నేశ్ విడాకుల రూమర్లపై క్లారిటీ

నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మీద ఒకప్పుడు రకరకాల రూమర్లు వస్తుండేవి. పెళ్లి కాక ముందు మీడియా ఎన్నోసార్లు విడగొట్టింది.. బ్రేకప్ చేయించింది.. తమ బ్రేకప్ గురించి వచ్చే రూమర్లను విఘ్నేశ్ శివన్ పరోక్షంగా ఖండిస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు పెళ్లైన తరువాత ఇలాంటి రూమర్లు తగ్గిపోయాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మీద రూమర్లు ఎక్కువయ్యాయి. ఇన్ స్టాగ్రాంలో అన్ ఫాలో కొట్టారని, ఫోటోలు కనిపించడం లేదని, బయో మార్చుకున్నారని అంటే.. వీరిద్దరూ దూరమయ్యారని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని ఇలా రకరకాల రూమర్లను ప్రచారం చేశారు.

కోలీవుడ్ మీడియాలో మొదలైన ఈ రూమర్లు నేషనల్ మీడియా వరకు పాకింది. తెలుగులోనూ నయనతార విడాకుల మీద రెండ్రోజులుగా వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ ఓ వీడియోను షేర్ చేశారు. ఫ్లూట్ మెన్‌తో కలిసి నయన్, విఘ్నేశ్‌లు ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇందులో నయన్, విఘ్నేశ్‌లు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు. ఇక నయన్ అయితే ముద్దులతో విఘ్నేశ్‌ను ముంచేస్తోంది.

ఈ వీడియోని వదిలి మంచి పని చేశారు.. విడాకులు తీసుకుంటున్నారని, విడిపోయారంటూ రాస్తున్న వారికి కొట్టినట్టుగా భలే ఖండించారు అంటూ నయన్ ఫ్యాన్స్, విఘ్నేశ్ శివన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ విడిపోలేదని ఇలా పరోక్షంగా వీడియోతో క్లారిటీ ఇచ్చారంటూ నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో మాత్రం ఇప్పుడు విఘ్నేశ్ షేర్ చేయడంతో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

నయనతార ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అన్నపూరణి సినిమాతో నయన్ మీద విమర్శలు వచ్చాయి. దీంతో నయన్ క్షమించమని కోరుతూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఎవ్వరినీ కించపర్చాలనే ఉద్దేశం తనకు లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించమని కోరింది.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *