NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Dubai International Airport) భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు (Indians tops the list of passengers in DXB). మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్‌పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.

ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివారల ప్రకారం, గతేడాది మొత్తం 86,994,365 మంది ప్రయాణికులు దుబాయ్ మీదుగా రాకపోకలు సాగించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 31.7 శాతం అధికం. 2019 నాటి గరిష్ఠంతో పోలిస్తే ఇది ఒకశాతం ఎక్కువ. ముఖ్యంగా గతేడాది ద్వితీయార్థంలో ప్రయాణికుల రాకపోకల్లో గణీయ వృద్ధి కనిపించిందని దుబాయ్ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రయాణికుల రాకపోకలు గరిష్ఠస్థాయికి (7.9 మిలియన్) తాకాయి.

ఇక దేశాల వారీగా చూస్తే అత్యధికంగా11.9 మిలియన్ మంది భారతీయులు దుబాయ్ మీదుగా ప్రయాణించారు. ఆ తరువాత స్థానంలో సౌదీ అరేబియా వాళ్లు ఉన్నారు. 6.7 మిలియన్ల సౌదీ వాసులు దుబాయ్ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించారు. 5.9 మిలియన్ల ప్రయాణికులతో బ్రిటన్ మూడోస్థానంలో నిలిచింది.

ప్రస్తుతం దుబాయ్ ఎయిర్ పోర్టు ద్వారా 104 దేశాల్లోని 262 గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తం 102 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఈ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు అందిస్తున్నాయి


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *