ప్రవాసీ కార్మికులకు శుభవార్త.. రూ. 17 లక్షల భీమా పథకం అమలు..

 దుబాయ్‌తో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని(UAE) వివిధ ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల(Indian Migrants) సంక్షేమార్ధం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్.పి.పి)(LPP) అనే వినూత్న భీమా పథకాన్ని దుబాయిలోని భారతీయ కాన్సులేట్(Indian Consulate) ప్రకటించింది. యుఏఇ తో సహా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కేవలం రోడ్డు, వృత్తిపరమైన ప్రమాదాల కొరకు మాత్రమే భీమా పథకం అమలులో ఉండడంతో సహజ మరణాలతో కుటుంబ దిక్కును కోల్పోయే ప్రవాసీయుల కుటుంబాలకు నయా పైసా సహాయం అందడం లేదు.

ఇక నుండి యుఏఇ లో ప్రమాదవశాత్తుతో పాటు సహాజ కారణాల వలన మరణించిన ప్రవాసీయులకు సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు చెల్లించె విధంగా ఎల్.పి.పి విధానాన్ని అమలు చేయనున్నట్లుగా భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ సివాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓరియంట్, గార్గష్ భీమా కంపెనీలు దీన్ని అమలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. యుఏఇలోని చట్టబద్ధ ఉపాధి వీసాపై ఉండి, 18 నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగిన భారతీయులు మూడు రకాల పాలసీలను పొందవచ్చు. వార్షిక ప్రీమియం రూ. 735 (37 దిర్హాంలు)కు సుమారు 8 లక్షల రుపాయాలు (35 వేల దిర్హాంలు), రూ. 1128 (50 దిర్హాంలు)కు సుమారు సుమారు 11.2 లక్షల రూపాయలు, రూ. 1625 (70 దిర్హాంలు)కు సుమారు 17 లక్షల రూపాయాలను పాలసీదారులు మరణిస్తే చెల్లిస్తారని కాన్సులేటు వివరించింది.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *