Warning: Undefined array key "steps" in /home/wordpress/doc_root/wp-content/plugins/amp/src/ReaderThemeSupportFeatures.php on line 501
Site icon Andhra News9

జగన్ లాయరే రాం గోపాల్ వర్మ వ్యూహం లాయర్

అవును మీరు చూస్తున్నది నిజమే. జగన్ కి లాయర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి కూడా లాయర్. అయితే వ్యూహం సినిమాతో మాత్రం జగన్‌కి సంబంధం లేదు . వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్ జగన్ సర్కారు.. అతిథులు జగన్ మంత్రులు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కి జగన్ టిటిడి పదవి కూడా ఇచ్చాడు

జగన్ అక్రమాస్తుల కేసులు, బాబాయ్ మర్డర్ కేసుతో పాటు మొత్తం జగన్ అండ్ టీం కేసులన్నీ డీల్ చేసే నిరంజన్ రెడ్డి, ఇప్పుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదల కోసం కేసు వాదిస్తున్నాడు. జగన్ లాయర్ ఆర్జీవికి లాయర్. కానీ జగన్ కి వ్యూహం సినిమాకి సంబంధం లేదు. ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ టీటీడీ పదవి ఇచ్చారు జగన్. ఇది ఏ సంబంధమో తెలియదు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రభుత్వమే రాం గోపాల్ వర్మ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పించింది అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఏపీ రిలీజ్ ఈవెంట్‌కి వైకాపా సర్కారే స్పాన్సర్. గోపాల్ వర్మతో పాటు వేదిక పైన జగన్ మంత్రులు రోజా, అంబటి వంటి వారు ఈ వ్యూహం వేడుకని నడిపించారు.

వ్యూహం నిర్మాతకు టిటిడి పదవి, సినిమా దర్శకుడు ఆర్జీవికి వందల కోట్లు ప్యాకేజీ, వ్యూహం సినిమా విడుదలపై కోర్టు కేసు వాదించడానికి జగన్ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డి, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి జగన్ మంత్రులు హాజరవుతారు. కానీ జగన్‌కి వ్యూహం సినిమాతో ఎటువంటి సంబంధం లేదు..ఇది రాంగోపాల్ వర్మ వ్యూహం అని ప్రచారం చేస్తారు..

బాబాయ్ హత్యతో అబ్బాయి జగన్ కి సంబంధం లేదని చెప్పడం ఎంత అబద్దమో! వ్యూహం సినిమాతో జగన్ కి సంబంధం లేదని చెప్పడం అంతకంటే పెద్ద అబద్ధం అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి?

Exit mobile version