Warning: Undefined array key "steps" in /home/wordpress/doc_root/wp-content/plugins/amp/src/ReaderThemeSupportFeatures.php on line 501
Site icon Andhra News9

పాలతో అరటిపండు తింటున్నారా..? ఏమవుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి…

మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారాల నుంచే అందుతుంది. ఏ రకం ఆహారం తీసుకున్నా అది మనకు మేలే చేస్తుంది. వాటిలో ఇమిడి ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు మన శరీరంలో జీవప్రక్రియలు సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడతాయి. అయితే, కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మంచివి అయితే, మరికొన్ని అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో పాలతో అరటిపండ్లు తినడం కూడా ఒకటి. అరటిపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు అని మనకు తెలుసు. అరటిపండులో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, శరీరానికి అవసరమైన అనేక ఇతర అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

పాలు, అరటి పండ్లు ఈ రెండూ మనకు ఆరోగ్యాన్నిచ్చేవే. అయితే ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. అరటిపండ్లను పాలతో కలిపి తింటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారు ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండటమే మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం అన్నంతో పండు తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పండ్లు త్వరగా జీర్ణక్రియను నిర్వహిస్తాయి. కానీ మీ భోజనం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. పాలను పుల్లటి పండ్లతో గానీ, అరటిపండ్లతో గానీ తీసుకోకుండా చూడాలి. బనానా షేక్‌ అనే ద్రావకాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. కానీ, ఇది ఆరోగ్యకర కాంబినేషన్‌ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతో చేపలు తినడం కూడా మంచి కలయిక కాదు. చేపల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి చేపలను పెరుగుతో కలిపి తీసుకుంటే, అది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తించుకోండి.

Exit mobile version