Warning: Undefined array key "steps" in /home/wordpress/doc_root/wp-content/plugins/amp/src/ReaderThemeSupportFeatures.php on line 501
Site icon Andhra News9

గ్రీన్‌ బీన్స్‌ తింటే.. 9 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!​

గ్రీన్‌ బీన్స్‌.. వీటిని స్ట్రింగ్ బీన్స్‌, స్నాప్‌ బీన్స్‌ అని కూడా పిలుస్తుంటారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో విటమిన్‌ ఏ, సి, కె, ఫోలిక్‌ యాసిడ్, మాంగనీస్‌, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రీన్‍ బీన్స్‌ తరచు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.​

గ్రీన్ బీన్స్‌లో ఫ్లేవనాయిడ్‌లు, కెరోటినాయిడ్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్‌ చేయడానికి తోడ్పడతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడానికి దోహద పడుతుంది.

గ్రీన్‌ బీన్స్‌లో ఫైబర్‌, పొటాషియం, ఫోలేట్‌ కంటెంట్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి, హృదయనాళ పనితీరును ప్రోత్సహిస్తాయి. తద్వారా.. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Exit mobile version