Warning: Undefined array key "steps" in /home/wordpress/doc_root/wp-content/plugins/amp/src/ReaderThemeSupportFeatures.php on line 501
Site icon Andhra News9

గొప్ప పనికి శ్రీకారం చుట్టిన రజనీకాంత్ ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నిజజీవితంలోనూ సూపర్ హీరోనే. మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేసే అలవాటు ఉన్న రజనీకాంత్.. తాజాగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు చెన్నైకి సమీపంలో భారీ ఆసుపత్రిని నిర్మించాలని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

రజనీకాంత్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ భారీ ఆసుపత్రి కోసం రజనీకాంత్ తిరుప్పుపూర్‌లో 12 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడట. త్వరలో భూమి పూజ కూడా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల పై ఇంకా రజనీకాంత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ పుకార్లు విన్న ఫ్యాన్స్ మాత్రం రజినీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పేదల కోసం ఆసుపత్రి నిర్మించడం గొప్ప విషయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version