Category: ఆంధ్ర ప్రదేశ్

  • కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం

    కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం

    తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం యాభై స్థానాల్లో మార్పు ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలే చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.…

  • పవన్ పై ముద్రగడ ఫైర్ వెనుక అసలు కారణం ఇదేనా?

    పవన్ పై ముద్రగడ ఫైర్ వెనుక అసలు కారణం ఇదేనా?

    ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు సృష్టించిన పేరు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. అయితే అదంతా గతం. గత కొన్నేళ్లుగా అడపాదడపా మినహా పూర్వ స్థాయిలో కాపుల గొంతుకై మాట్లాడటం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఆయన మళ్లీ ఫేమస్ అయిపోయారు. ఆయనపై వరుస విమర్శలతో విరుచుకు పడుతూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పటికే రెండు లేఖలు రాసిన…

  • టిడిపితో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే

    టిడిపితో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే

    ఏపీలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం వ్యూహం, మ్యానిఫెస్టో ఖారారు వంటి అంశాల పై దృష్టి సారించాయి. రాష్ట్రంలో పొత్తులపై దాదాపు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, జనసేన పొత్తు ఇక అధికారకమే. కేవలం అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పోటీ చేసే స్థానాల పై కూడా పూర్తిస్థాయిలో చర్చలు జరిగినట్లు సమాచారం. పవన్ గతంలో చెప్పినట్లుగా పొత్తుల గురించి ఇప్పుడు వారాహి యాత్రలో ప్రస్తావన…

  • 200 పైగా యూట్యూబ్ చానెల్స్ తో ఎన్నికల సమరంలోకి వైసీపీ

    200 పైగా యూట్యూబ్ చానెల్స్ తో ఎన్నికల సమరంలోకి వైసీపీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం దూసుకుపోతున్న పార్టీల నేతలు, తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను టిడిపి, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే, వాటిని తిప్పికొట్టే పనిలో అధికార వైసీపీ పార్టీ నేతలు ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాము అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను, ఆంధ్రప్రదేశ్…

  • గోదావరి జిల్లాల్లో టిడిపి-జనసేన సునామీ ఖాయం

    గోదావరి జిల్లాల్లో టిడిపి-జనసేన సునామీ ఖాయం

    ఏపీలో రాబోయే ఎన్నికల్లో గోదావరి జిల్లాల సీట్లు కీలకం కానున్నాయి. ఆ రెండు జిల్లాల్లో ఎవరైతే మెజారిటీ సీట్లు సాధిస్తారో వారే అధికారం చేప్పట్టే అవకాశం ఉందన్న సర్వ్ రిపోర్టుల ఆధారంగా అన్ని ప్రభుత్వాలు కార్యాచరణకు పూనుకున్నాయి. ఇక ఇప్పటివరకు సినిమాలతో బిజీగా గడిపిన జనసేనాని ఇప్పుడు గోదావరి జిల్లాల్లో సునామీ సృష్టిస్తున్నారు. వారాహి యాత్రలో పవన్ సభలకు జనం భారీగా తరలి వస్తున్నారు. గతంలో లేని విధంగా పవన్‌కు ప్రజా మద్ధతు క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ…

  • ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహమేంటి?

    ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహమేంటి?

    ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత కొందరు కీలక నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ కమలం గూటికి చేరిపోయారు. ఒకానొక దశలో వైసీపీ నుంచి తమని తాము రక్షించుకోడానికి రాష్ట్ర టిడిపి నాయకులు అందరూ బిజెపి కండువా కప్పుకుంటారని బిజెపి భావించింది. అయితే బిజెపి ఆశించిన విధంగా ఏమీ జరగలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఏమాత్రం పెరగలేదనేది…

  • రేపల్లెలో అనగాని దూకుడుతో హ్యాట్రిక్ పై కన్నేసిన టిడిపి

    రేపల్లెలో అనగాని దూకుడుతో హ్యాట్రిక్ పై కన్నేసిన టిడిపి

    ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వై నాట్ 175 అని రెచ్చిపోయిన వైసీపీ ఇప్పుడు అధికారం నిలబెట్టుకుంటే చాలు అనే స్థాయిలో ఉంది. ఇక టిడిపి అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలిచి కౌరవ సభగా మారిన ఏపీ అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తామని ప్రకటించింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి పరువు కోల్పోయింది. అతి పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉన్న గుంటూరు జిల్లాలో టిడిపి గెలిచింది ఏకైక సీటు…

  • ఏలూరి Vs ఆమంచి.. పర్చూరులో గెలుపెవరిది?

    ఏలూరి Vs ఆమంచి.. పర్చూరులో గెలుపెవరిది?

    ఏలూరి Vs ఆమంచి.. పర్చూరులో గెలుపెవరిది? ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జిల్లాల్లో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎవరు ఎవరి వైపు ఉంటారు, ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారు అన్న విషయాల్లో స్పష్టత రానప్పటికీ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో నామమాత్రంగానే సీట్లు సంపాదించినా టిడిపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అడ్డంకి, కొండెపి స్థానాల నుంచి టిడిపి…

  • రంగంలోకి దిగిన దొంగ మేధావులు.. టిడిపి జాగ్రత్త పడకపొతే ఇబ్బందులే

    రంగంలోకి దిగిన దొంగ మేధావులు.. టిడిపి జాగ్రత్త పడకపొతే ఇబ్బందులే

    రంగంలోకి దిగిన దొంగ మేధావులు.. టిడిపి జాగ్రత్త పడకపొతే ఇబ్బందులే 2019 లో ఎంతో హోరాహోరీగా జరుగుతాయి అనుకున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ ఎన్ని రకాల వ్యూహాలు రచించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టి‌డి‌పిని దెబ్బతీయడానికి ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి.. టి‌డి‌పిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసింది. ఇక రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కొంతమంది తెరపైకి వచ్చి…

  • అధికారుల అండతో ఏపీలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు

    అధికారుల అండతో ఏపీలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు

    చంద్రగిరి నియోజకవర్గంలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5వ తేదీ నుంచి 9వరకు ఫామ్ 6 ద్వారా 10వేల ఓట్లు నమోదుకు దరఖాస్తులు చేయించారని ఆరోపించారు. ఇన్ని వేల దరఖాస్తులు…