రేపల్లెలో అనగాని దూకుడుతో హ్యాట్రిక్ పై కన్నేసిన టిడిపి

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వై నాట్ 175 అని రెచ్చిపోయిన వైసీపీ ఇప్పుడు అధికారం నిలబెట్టుకుంటే చాలు అనే స్థాయిలో ఉంది. ఇక టిడిపి అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలిచి కౌరవ సభగా మారిన ఏపీ అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తామని ప్రకటించింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి పరువు కోల్పోయింది. అతి పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉన్న గుంటూరు జిల్లాలో టిడిపి గెలిచింది ఏకైక సీటు రేపల్లె. తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఇది ఒకటి. ఇక్కడ ఎన్నికల్లో ఎక్కువసార్లు టి‌డి‌పి జెండా ఎగిరింది. అప్పుడప్పుడు కాంగ్రెస్ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేసినా టీడీపీ ఆధిపత్యం కోల్పోలేదు.

గత 2014, 2019 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి అనగాని సత్యప్రసాద్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో గెలిచి టి‌డి‌పి అధికారంలో ఉండగా అనగాని.. రేపల్లెని అభివృద్ధి బాట పట్టించారు. రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, తాగునీరు వసతి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగు పర్చడం చేశారు. అలాగే ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందు ఉండేవారు. మరీ ముఖ్యంగా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్నారు. దీంతో రేపల్లె ప్రజలు 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే అనగానిని మళ్ళీ గెలిపించారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక రేపల్లెపై ఏదో రకంగా పట్టు సాధించాలని చూస్తూ వచ్చింది. అధికార బలంతో లోకల్ ఎన్నికల్లో గెలిచింది. దీంతో ఇంక రేపల్లె పై తమదే ఆధిపత్యం అనే దిశగా హడావిడి చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలు టి‌డి‌పి వైపే ఉన్నారు. అనగాని సైతం ప్రజలకు ఎపుడు అండగానే ఉంటున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన వెంకటేశ్వర్లు రెడ్డి అనే వ్యక్తి.. 10వ తరగతి చదువుతున్న అమర్నాథ్ అనే బాలుడుని సజీవ దహనం చేసిన అంశం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన అక్కని వేధిస్తున్నాడని చెప్పి అమర్నాథ్.. వైసీపీ కార్యకర్తకు వార్నింగ్ ఇచ్చాడట.

దీంతో పగ పెంచుకుని వైసీపీ కార్యకర్త.. తన స్నేహితులతో దారి కాచి.. అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. దీంతో బాలుడు మరణించారు. ఆ బాలుడి కుటుంబానికి అనగాని అండగా నిలిచారు. వైసీపీ సాయం పేరుతో రాజకీయం చేసినా.. ఆ కుటుంబానికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు అండగా నిలిచారు. ఈ విషయంలో అనగానిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రేపల్లెలో అనగానికికి ఆధిక్యం ఉంది. దీంతో రేపల్లెలో అనగాని హ్యాట్రిక్ కొట్టడం ఫిక్స్ అంటున్నారు పరిశీలకులు.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *