నేను కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా – మహేష్ బాబు

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో SSMB 29 మూవీ చేయనున్నారు మహేష్ బాబు. విషయం ఏమిటంటే, తాజాగా ఒక ప్రముఖ జాతీయ పత్రికతో మహేష్ ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ, ఇటీవల తాను నటించిన గుంటూరు కారం మూవీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మొత్తంగా ప్రేక్షకులని ఆకట్టుకుని విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అలానే తన కెరీర్ లో మురారి, పోకిరి మరియు శ్రీమంతుడు సినిమాలు కెరీర్‌ని గణనీయంగా మార్చాయన్నారు. ఈ మూడు ప్రాజెక్ట్‌లలో ప్రతి ఒక్కటి, ముఖ్యంగా కథాకథనం యొక్క విభిన్న కోణాలను అన్వేషించడానికి మరియు ప్రేక్షకులతో ఎంతో కనెక్ట్ అవ్వడానికి దోహదపడ్డాయని తెలిపారు. ఇక త్వరలో చేయనున్న రాజమౌళి గారి సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం బాగా జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు సూపర్ స్టార్.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *