అధికారుల అండతో ఏపీలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు

చంద్రగిరి నియోజకవర్గంలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5వ తేదీ నుంచి 9వరకు ఫామ్ 6 ద్వారా 10వేల ఓట్లు నమోదుకు దరఖాస్తులు చేయించారని ఆరోపించారు. ఇన్ని వేల దరఖాస్తులు ఎలా వస్తున్నాయని అధికారులను ఆమె సూటిగా ప్రశ్నించారు. 6 నెలలుగా పోరాటం చేయడంతో 22వేలు రిజెక్ట్ చేశారని, ఇప్పుడు మళ్లీ 10వేలు దరఖాస్తులు కొత్తగా పుట్టుకొచ్చాయన్నారు.

ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ లీడర్లు సర్పంచులు, ఎంపీటీసీలుగా ఉన్న చోట ఎక్కువ ఫామ్ 6లు వస్తున్నాయన్నారు. తుమ్మలగుంట 700, పాడిపేటలో 960, పాకాల, మంగళం, దామినేడు 600, చంద్రగిరి టౌన్ నందు పలు బూత్ లలో 1000 పైగా, మరియు పలు పంచాయతీలలో దరఖాస్తులు వచ్చాయని ఆధారాలను మీడియా ఎదుట ఉంచారు. ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలకు పాల్పడ్డుతున్నారన్నారు. తుమ్మలగుంట నందు 6 పేర్లతో 54 ఓట్లకు ఫామ్ 6 రావడం ఏమిటని మండిపడ్డారు.
ఒక్క మంగళం పంచాయితీ నుంచి 1000 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే చేష్టలకు విసిగిపోతున్నామన్నారు. ఏకంగా మహిళ బిఎల్వోలను బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పది మందికి కనిపించే ఆయన రూపం వేరని.. ఎవ్వరికి తెలియని అసలు రూపం వెరే ఉందన్నారు. నాపై కూడా 4 కేసులు సృష్టించారని, నేను కూడా ఆయన బాధితురాలినే అన్న ఆమె, ఆడవాళ్ళు జోలికి వస్తే మాత్రం చూస్తు ఊరుకోమన్నారు. ఆయన అసలు రంగు ఆధారాలతో పాటు బయట పెడుతానన్నారు. ఏ రకంగా చూసినా ప్రజలకి ఎక్కడా న్యాయం జరగలేదు.. ఓటర్లు విసిగివేశారిపోయారన్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓపిక నశించిపోతుంది.. చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. తప్పులకు పచ్చాత్తాపం పడుతారు అని ఆన్నారు. చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయాలపై మేథావి వర్గం బయటకు వచ్చి మాట్లాడాలని పిలుపునిచ్చారు.

2019లో పులివర్తి నాని ఎమ్మెల్యే పై రెక్కీ చేశారనే స్థాయికి దిగజారి విమర్శలు చేశారని గుర్తు చేశారు… కొత్తగా నియోజకవర్గానికి వస్తే రౌడీ అని, దళిత ద్రోహి అని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ఒక్క పదవైనా ఇచ్చారా… ఒక్క ఉద్యోగం ఇచ్చారా… అని ప్రశ్నించారు. మీ పాలనలో వైసీపీ నాయకులకే న్యాయం జరగడం లేదన్న ఆమె ప్రజలకు ఏం చేస్తారన్నారు. “మేదావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతున్నారని”, కావున మేథావి వర్గం, విద్యార్థులు అవినీతి పాలనపై ఉద్యమించాలన్నారు. ఓటర్లు జాబితాలో అవకతవకలు అరికట్టకపోతే ఢిల్లీ కి వెళ్లి “జంతర్ మంతర్” దగ్గర “ఆమరణ నిరహార దీక్ష” చేస్తానని హెచ్చరించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని 2017 నుంచి దొంగ ఓట్లు నమోదుపై ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టి బాధ్యులు ఎక్కడ ఉన్నా చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.

Share :


Facebook

Twitter

Pinterest

WhatsApp

సంబంధిత కథనాలు

తాజా కథనాలు


మరిన్ని…

పోల్స్



More


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *