జగన్ మార్చబోతున్న 80 నియోజకవర్గాల ఇంచార్జులు వీరే?

వచ్చే ఏఢాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దాదాపు 82 సీట్లలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పలు సంచలనాలు ఉన్నాయి.

ఏపీలో వైసీపీ నిన్న 11 అసెంబ్లీ సీట్లలో కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది. ఇందులో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పొరుగు నియోజకవర్గాలకు మార్చడంతో పాటు పలు చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అయితే ఇది మొదటి జాబితా మాత్రమేనని, త్వరలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో 82 సీట్లలో వైసీపీ కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మార్పులు జరుగుతున్న నియోజకవర్గాలను ఓసారి పరిశీలిద్దాం..

వైసీపీ కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటిస్తుందని భావిస్తున్న నియోడజకవర్గాల జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, టెక్కలి, ఇచ్ఛాపురం, విజయనగరం జిల్లాలోని రాజాం, బొబ్బిలి, ఎచ్చెర్ల, విశాఖపట్నం జిల్లా గాజువాక, విశాఖపట్నం సౌత్, అనకాపల్లి జిల్లా పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అరకు జిల్లాలోని అరకు, పాడేరు ఉన్నాయి. అలాగే కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఉన్నాయి. అమలాపురం జిల్లాలో అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం ఉన్నాయి. దీంతో పాటు రాజమండ్రి సిటీ సీటు కూడా ఉంది.

నరసాపురం నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం, ఉండి సీట్లలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు సీట్లలో కొత్త ఇన్ ఛార్జ్ లు రాబోతున్నారు. మచిలీపట్నం జిల్లాలో అవనిగడ్డ, పెడన సీట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట సీట్లు ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్ సీట్లు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరి పేట, బాపట్ల జిల్లాలో రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు ఉన్నాయి. ఒంగోలు జిల్లాలో దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండెపి, మార్కాపురం ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. తిరుపతి జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు ఉన్నాయి.

అలాగే చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, రాజంపేట జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం, కర్నూలు జిల్లాలో కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు ఉన్నాయి. అలాగే నంద్యాల జిల్లాలో నందికొట్కూరు సీటులోనూ మార్పు చేయనున్నారు. సత్యసాయి జిల్లాలో హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి, అనంతపురం జిల్లాలో శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం సీట్లు కూడా ఉన్నాయి.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *